గంజాయి రవాణాకు అలవాటుపడ్డ ఓ వ్యక్తిపై ఖమ్మం జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అక్రమార్జనకు అలవాటుపడి గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు బొజ్జ వంశీ (22) పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ప్రకటించారు.

ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి కార్యకలాపాలకు అలవాటు పడిన గంజాయి నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
నిందితుని వివరాలను పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

నిరుడు ఏప్రిల్ నెలలో ఖమ్మం రూరల్ సర్కిల్‌లోని రఘునాధపాలెం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ గంజాయి కేసులో రూ. ముప్పై లక్షల విలువ గల 194 కేజీల గంజాయితో పట్టుబడ్డ నిందితుడు బొజ్జ వంశీ అని సీపీ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. నిందితుడి స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంగా చెప్పారు. ఇతనిపై పీడి యాక్ట్ ఆమలు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిందితున్ని చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించి సంబంధిత పత్రాలను జైలు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

Comments are closed.

Exit mobile version