తెలంగాణా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నియమ, నిబంధనలకు విరుద్ధంగా సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ సీఎస్ గా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై 298 కోర్టు ధిక్కార ఘటనలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన సోమేష్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నపుడు ఎనిమిదేళ్లపాటు సర్వీసును వదిలి ప్రైవేట్ కంపెనీల్లో పని చేశారని చెప్పారు. ఆ ఎనిమిదేళ్ల పీరియడ్ ను సర్వీస్ నుంచి తొలగిస్తే సోమేష్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో నియమించడానికి కూడా చట్టం అనుమతించదని రేవంత్ అన్నారు. సోమేష్ కుమార్ పై రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.