మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి సంచలన ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. అతని ఫోన్ ట్యాపింగ్ కు గురైంది.
తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని, అంతేగాక అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావుపైనేగాక, అప్పటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావుపైనా పోలీసులు 120 (బీ), 386, 409, 506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.