వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ ఆధిక్యంలో కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఇదే సరళిని నిలుపుకున్నారు. మూడో స్థానంలో నిలిచిన టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియలో పల్లాతోపాటు ద్వితీయం స్థానంలో గల తీన్మార్ మల్లన్న కూడా పోటా పోటీగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే 24 వేల పైచిలుకు ఆధిక్యంలో గల పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయావకాశాలు మరింత మెరుగైనట్లు తెలుస్తోంది. ఇదే దశలో తీన్మార్ మల్లన్న కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.