పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ అద్భుత మీటింగ్ లో ప్రసంగించారు. ఆయన వెటకారంగా అన్నారో, మరే ఉద్దేశంతో అన్నారో తెలియదుగాని ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న తన సభను ‘అద్భుత మీటింగ్’గా పల్లా అభివర్ణించడమే అసలు విశేషం. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు ఉమ్మడి జిల్లాల్లో పల్లా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న వరంగల్ లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు అధికార పార్టీకి చెందిన హేమాహేమీలైన నాయకులు హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్న ఈ సభ తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
తన గెలుపుకోసం వరంగల్ జిల్లా నేతలు నిర్వహించిన ఈ సభలో ప్రసంగిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమంటున్నారో, అక్కడ గల దృశ్యం చెబుతున్నదేమిటో వీడియోను చివరి వరకు చూడండి. ‘అద్భుత మీటింగ్’లోని అసలు విషయం మీకే అర్థమవుతుంది.