సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో ముగ్గురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందని కారణంగా ముగ్గురు కరోనా బాధితులు మరణించారు. దాదాపు 2 గంటలుగా 20 మంది రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించారనేది బాధిత కుటుంబీకుల, సంబంధీకుల ఆరోపణ. అయితే ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావాల్సి ఉండగా, అడ్రస్ తెలియక ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విషయంపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి సహాయంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరుకుంది. కానీ అప్పటికే ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడం విషాదం.

Comments are closed.

Exit mobile version