మళ్లీ వర్షం కురిసింది. గత మంగళవారం కురిసిన భారీ వర్షం ధాటికి ఇప్పటికీ వరద, బురదల నుంచి తేరుకోని రాజధానివాసులను నిన్న రాత్రి కురిసిన వర్షం మళ్లీ భయపెట్టింది. అనేక కాలనీలు నీట మునిగాయి. విద్యుత్ షాక్ తో ఇద్దరు మరణించారు. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. నగర జనం నరకాన్ని అనుభవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం మూడు గంటల్లో 12 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇదీ విశ్వనగరం హైదరాబాద్ తాజా పరిస్థితి.
ఔను… హైదరాబాద్ లో మళ్లీ కురిసిన వర్షాలకు వందలాది కాలనీలు మళ్లీ జలమయమయ్యాయి. ఈ జలం ఎక్కడికి వెళ్లాలి? ఇదీ అసలు ప్రశ్న. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు 180కి పైగా చెరువులు ఉండేవట. అవేమిటో ఓసారి చూద్దాం.
హుస్సేన్ సాగర్
ఉస్మాన్ సాగర్
హిమయత్ సాగర్ తో పాటూ…….
మీరాళం చెరువు
తలబ్ కట్ట చెరువు
మంత్రాల చెరువు,
కొత్త చెరువు,
ఐడీపీఎల్ చెరువు,
హస్మత్‌పుర చెరువు,
బాలాజీనగర్ చెరువు,
కౌకూర్ చెరువు,
సూరారం చెరువు,
లింగంచెరువు,
వెన్నెలగడ్డ చెరువు,
ప్రగతినగర్ చెరువు,
కాప్రా చెరువు,
కీసర చెరువు,
పూడురు చెరువు,
ఎల్లమ్మపేట చెరువు,
మేకంపూర్ చెరువు,
నల్లచెరువు,
పల్లె చెరువు,
దుర్గం చెరువు,
రామంతపూర్ చెరువు,
సఫీల్ గూడ చెరువు,
అల్వాల్ చెరువు,
సరూర్ నగర్ చెరువు,
అమీనాపూర్ చెరువు,
జీడిమెట్ల చెరువు,
బంజారా చెరువు (బంజారాహిల్స్)
షామీర్ పేట్ చెరువు
నారాయణరెడ్డి కత్వా,
బాచారం కత్వా,
హీరా కత్వా,
రాయిన్‌చెరువు,
మాలోనికుంట,
అంట్ల మాసమ్మకుంట,
మైసమ్మ చెరువు,
పెద్ద చెక్ డ్యాం,
మెట్టు కత్వా,
బుంగ కత్వా,
బూబాగడ్డ చెక్ డ్యాం,
ఎర్రబండ చెక్‌డ్యాం,
బంధంకుంట,
బైరాంఖాన్ చెరువు,
ఈదులచెరువు,
దిల్‌వార్‌ఖాన్ చెరువు,
పోల్కమ్మ చెరువు,
అంతాయపల్లి చెరువు,
కుంట్లూర్ చెరువు,
కంబాలకుంట,
మాసబ్ చెరువు,
వడ్లకుంట,
కొత్త చెరువు,
బందకుంట,
అమీర్‌పేట,
యూసుఫ్‌గూడ చెరువు,
శ్యామలకుంట సనత్‌నగర్,
మైసమ్మకుంట,
చాపల చెరువు
కేవలం ఆయా చెరువులే కాదు…
తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్ కీసమున కుంట, హెచ్ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్ లే ఔట్ చెరువు, బండకుంట, సుదర్శన్ చెరువు, అంజయ్య చెరువులు ఉండేవి. ఇందులో అనేక చెరువులు ప్రస్తుతం పూర్తిగా కనిపించకుండా పోయాయి.
ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వర్షం నీరు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వస్తోందని గగ్గోలు పెట్టేవాళ్లు గమనించాల్సిన అంశమేమిటంటే… రాజధాని నగరమే చెరువుల్లోకి చొచ్చుకు పోయిందని. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన వారిదే అసలు నేరం. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పూర్తి పాపం. నగరంలో మంచి నీటి చెరువులు (హుస్సేన్ సాగర్ సహా) మురికికూపాలుగా మారుతుంటే చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మాయమైపోయిన అనేక చెరువుల జాడ కనిపెడితే ఇటువంటి వర్షాలు ఎన్ని కురిసినా హైదరా‘బాధ’ ఉండదని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదీ సంగతి.