బీజేపీకి చెందిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు సంచలన ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించినట్లు పేర్కొంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సీఎల్ఫీ నేత మల్లు భట్టి విక్రమార్కల మధ్య ఇందుకు సంబంధించి తీవ్ర వాగ్యుద్ధం కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో వ్యంగ్య ట్వీట్ చేశారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ వార్తా కథనపు వీడియోను ట్యాగ్ చేస్తూ, డబుల్ బెడ్ రూం ఇళ్ల దృశ్యానికి సంబంధించి తెలంగాణాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ స్నేహపూర్వక పరిహాసమాడుతున్నట్లు అభివర్ణించారు.
‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, టీఆర్ఎస్-కాంగ్రెస్ డబుల్ బెడ్ రూం పేరంటం’ అనే వ్యాఖ్యలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎంపీ అర్వింద్ చేసిన ఆయా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.