మనం ఏదో మూడ్ లో ఉండి..ఏదో స్టేజ్ లో ఉండి, ఏదో మాట్లాడేసి, పైవాళ్ల మెప్పు కోసమో, లేదా ఎవరో చప్పట్లు కొడతారనో, ఏది బడితే అది మాట్లాడేసి అనడం పద్దతి కాదు..అంటూ భారీ డైలాగ్ లతో చర్చ నడిపిన ఏపీ 24X7 న్యూస్ ఛానల్ సీఈవో వెంకటకృష్ణ కమెడియన్, ఎస్వీబీసీ ఛానల్ మాజీ చైర్మెన్ పథ్వీరాజ్ పై నోరు జారారు. ఏదేని అంశంపై చర్చ జరుగుతున్నపుడో, లేదా వార్తలు చదువుతున్నపుడో యాంకర్లు పొరపాటున నోరు జారడం సహజం. మరికొందరు డిబేట్లలోనే బూతులు వల్లిస్తుంటారు అది వేరే విషయం.
ఆ మధ్య అదేదో టీవీలో ఓ యాంకర్ సినీఫీల్డులో అటువంటివారు లేరా? అని ఓ బూతు పదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. కానీ డిబేట్ ముగిశాక యాంకర్లు-కమ్-జర్నలిస్టులు కొందరు కెమెరా ఆఫ్ చేశారనే నమ్మకంతో చేసే వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతుంటాయి. ఇదిగో ఏపీ 24X7 న్యూస్ ఛానల్ సీఈవో వెంకటకృష్ణ మాదిరిగా అన్నమాట. తన గురించి గోవిందరావుపేట సెంటర్లో తెలుసుకోవాలని, తాను తీవ్రవాద ఉద్యమం నుంచి వచ్చానని, చావు తప్పి బయటపడిన వాడినని, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని సూక్తులు వల్లించిన వెంకటకృష్ణ ఆఫ్ కెమెరా అనుకుని పృథ్వీరాజ్ గురించి ఏం మాట్లాడారో దిగువన సదరు ఛానల్ వీడియోలోనే వీక్షించి… చెవులారా వినండి మరి. ఇంతకీ.. ఇదేం బాస ఎంకటకిష్ణా..!