భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్ విధ్వంసానికి దిగారు. చర్ల మండలం బత్తినపల్లి రోడ్డు పనులు చేస్తున్న రెండు వాహనాలను నక్సలైట్లు దహనం చేశారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఈ ఘటన తెలంగాణా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కలకలం సృష్టించింది. ఈనెల 28వ తేదీ నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జరుపుకోవాలని పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి జిల్లా కమిటీ పేరుతో సంఘటనా స్థలంలో నక్సల్స్ ఓ ప్రకటన కూడా వదిలారు.