ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ బాడీ బిల్డింగ్ పోటీల సందర్భంగా ‘కండ’ల వీరులు ఖమ్మం నగరంలో సందడి చేశారు. ప్రముఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ఈ పోటీల సందర్భంగా దేశం నలుమూలల నుంచి బాడీ బిల్డర్లు తరలివచ్చారు. పోటీల నిర్వహణ సందర్భంగా రెండో రోజైన శుక్రవారం నాటి కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను దిగువన చూడవచ్చు.