పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆంధప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు ఎంపీ రఘురామ కృష్ణరాజు భంగం కలిగించారనేది ఏపీ పోలీసుల అభియోగం. ఈమేరకు ఎంపీ భార్య రమాదేవికి నోటీసులు జారీ చేసిన పోలీసులు రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఎంపీని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు అతన్ని విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.