నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డిల మధ్యే ప్రధాన పోటీ జరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గురువారం ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవీ వివరాలు:
మిషన్ చాణక్య సర్వే:
ఓటు షేర్: టీఆర్ఎస్ 49.254, కాంగ్రెస్ 37.92 శాతం
బీజేపీ 7.80 శాతం, ఇతరులు 5.04 శాతం
టీఆర్ఎస్ 93,450, కాంగ్రెస్ 71,964 ఓట్లు
బీజేపీ 14,806, ఇతరులు 9,561 ఓట్లు
ఆత్మసాక్షి సర్వే:
ఓటు షేర్: టీఆర్ఎస్ 43.5 శాతం, కాంగ్రెస్ 39.5 శాతం
బీజేపీ 14.6 శాతం, ఇతరులు 2.4 శాతం