తెలంగాణాలో మినీ మున్సిపల్ ఎన్నికల పోరాటానికి నగారా మోగింది. ఈనెల 30వ తేదీన రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లకు, అయిదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ
ఈనెల 30న పోలింగ్
మే 3న కౌంటింగ్
ఈనెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఈనెల 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది ఈనెల 22
మొత్తం 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు
ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్లు : వరంగల్, ఖమ్మం
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు: అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లు- 66
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో లో డివిజన్లు-60