కోటీశ్వరులు చాలా మంది ఉంటారు. కానీ తమ సంపన్న మనస్తత్వాన్ని పేదల కోసం యోచించే వారు కొందరే ఉంటారు. అందులోనూ అనాథలను అక్కున చేర్చుకుని, తమ పిల్లల్లా పెంచి పెద్ద చేసేవారు అత్యంత అరుదుగా ఉంటారు. పెంచి పెద్ద చేయడమే కాదు, వాళ్ల పెళ్లిళ్లు కూడా చేసి పెద్ద మనసును చాటుకునేవారు సైతం స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. ఇటువంటి అన్ని కోవలకు స్ఫూర్తిగా నిలుస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవి చంద్ర. తన దొడ్డ మనసును చాటుకోవడంలోనూ ‘రాజు’గా నిలిచిన రవిచంద్ర తాజాగా నిర్వహించిన మరో శుభకార్యమేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..

తమ అభిమానుల, అనుయాయుల గుండెల్లో పుణ్య దంపతులుగా ప్రసిద్ధి గాంచారు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మిలు. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం వంటి అనేక కార్యక్రమాల నిర్వహణలో వద్దిరాజు దంపతుల భక్తి, సేవాగుణం గురించి కొత్తగా నిర్వచించాల్సింది కూడా ఏమీ లేదు. ఎన్నో గుళ్లకు, గోపురాలకు, పెళ్లిళ్ల వంటి అనేక శుభకార్యాలకే కాదు, మానవత్వాన్ని చాటుకునే అంశాల్లోనూ భూరీ విరాళాలు ఇవ్వడంలో వద్దిరాజు రవిచంద్రది ఎముకలేని చేయిగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఇటువంటి అనేక అంశాల్లో తన పెద్దమనసును తరచూ చాటుకునే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజయలక్ష్మీ దంపతులు గురువారం నిర్వహించిన ఓ శుభకార్యం పలువురి ప్రశంసలకు నోచుకుంది.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన రాజు అనే నాలుగేళ్ల బాలుడు దృరదృష్టవశాత్తు అతి చిన్న వయస్సులోనే తన తల్లిదండ్రులను  కోల్పోయాడు. హోంగార్డుగా పని చేస్తున్న రాజు తండ్రి ఆకుల సత్యం, ఆ తర్వాత కొన్ని రోజులకు అతని తల్లి నాగమ్మ కూడా అనారోగ్యంతో మరణించారు. తన స్వగ్రామమైన ఇనుగుర్తికి చెందిన రాజు ఇలా అనాథగా మారడంతో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు చలించిపోయారు. రాజును చేరదీసి, తమ కుటుంబ సభ్యునిగానే భావించి పెంచి పెద్ద చేశారు. ఈ నేపథ్యంలోనే రాజుకు పెళ్లీడు రావడంతో వివాహం జరిపించాలని తలంచారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహాన్ పురానికి చెందిన బొమ్మెరబోయిన సంపత్, దేవమ్మల ఏకైక కూతురు ప్రతిభను వధువుగా నిర్ణయించి, మాట్లాడి రాజుకు  పెళ్లి ఏర్పాట్లు చేశారు. రాజు-ప్రతిభల పెళ్లి ఖమ్మం టీఎన్జీవో కళ్యాణ మండపంలో ఈనెల 11న ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుకకు రవిచంద్ర సోదరులు, ఇతర బంధుగణమైన వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్-ఇందిరమ్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరీ దంపతులు, వద్దిరాజు కమలమ్మ, వద్దిరాజు మోహన్-వాసవి, వద్దిరాజు పెద్ద వెంకటేశ్వర్లు-పద్మ, డాక్టర్ గంగుల గంగా భవాని, వద్దిరాజు నిఖిల్ చంద్ర, వద్దిరాజు శ్రీనివాస్,సంగిశెట్టి రాంమూర్తి-పద్మ,శీలం సత్యనారాయణ -లక్మీ, వాళ్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై అక్షితలు వేసి నూతన దంపతులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఓ అనాథను అక్కున చేర్చుకుని పెంచి, పెద్ద చేయడమే కాదు, పెళ్లి కూడా చేసి ఓ ఇంటి వాడిని చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దొడ్డ మనసును పలువురు కొనియాడారు.

Comments are closed.

Exit mobile version