రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఉత్సవ కమిటీలో ఎంపీ వద్దిరాజుకు మరోసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వపరంగా ప్రతిపాదించడం విశేషం. సాధారణంగా పాలక పార్టీకి చెందిన, అనుకూలమైనవారిని మాత్రమే మేడారం జాతర ఉత్సవ కమిటీలో అవకాశం కల్పిస్తారు. అయితే గత జాతర ఉత్సవ కమిటీలో స్థానం గల వద్దిరాజు రవిచంద్రకు ఈసారి కూడా స్థానం కల్పించాలని మంత్రి సీతక్క లిఖిత పూర్వక లేఖ ద్వారా ప్రతిపాదించడం గమనార్హం. తద్వారా కాంగ్రెస్ సర్కారు సమ్మక్క, సారలమ్మ దేవతల భక్తుడైన వద్దిరాజు రవిచంద్రకు సముచిత గౌరవాన్ని కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి సీతక్క ప్రతిపాదనల ప్రకారం దేవాదాయ శాఖ ఈమేరకు నివేదికను కోరుతూ ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో భాగంగానే మేడారం ఉత్సవ కమిటీ చైర్మెన్ గా అర్రెం లచ్చు పటేల్ ను, సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, యాపా అశోక్, పోరీక నారాయణ్ సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొర్రం అబ్బయ్య, ఆల శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణమూర్తిలను, ఎక్స్ అఫీషియో మెంచర్ గా సిద్దబోయిన జగ్గారావును నియమించాలని మంత్రి సీతక్క ప్రతిపాదించారు. ఈ కమిటీ నియామకానికి సంబంధించిన పూర్తి నివేదికు సమర్పించాల్సిందిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ అధికార వర్గాలను ఆదేశించారు.
మేడారం ఉత్సవ కమిటీీ చైర్మెన్ గా నియమితుడైన లచ్చు పటేల్