కేసు విచారిస్తున్న న్యాయమూర్తి అతడు చేసిన నేరాలు విని నిర్ఘాంతపోయారు. ఇటువంటి క్రూరున్ని తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రమాదకర నేరస్థుడు సమాజంలో తిరిగే అర్హత లేదని తేల్చారు. అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
ఇంతకీ అతనెవరంటే…పేరు రేన్ హార్డ్ సినాగా. వయస్సు 36 ఏళ్లు. ఇండోనేషియాకు చెందిన సినాగా కొన్నేళ్లుగా బ్రిటన్ లోని మాంచెస్టర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. సినాగా సెక్స్ సైకోగా మారాడు. విచిత్రమేమిటంటే అతను పురుషులనే టార్గెట్ గా చేసుకోవడం. రెండేళ్ల వ్యవధిలో అంటే…2015-17 సంవత్సరాల్లో ఏకంగా 190 మంది పురుషులను రేప్ చేశాడు. పురుషులకు పీకలదాకా మందు కొట్టించి, డ్రగ్స్ సేవింపజేస్తుండేవాడు. ఆయా మాదకద్రవ్యాల మత్తులో గల పురుషులపై సెక్స్ సైకోగా మారిన సినాగా అత్యాచారాలకు పాల్పడేవాడు.
దీంతో సినాగాను మోస్ట్ వాంటెడ్ రేపిస్ట్ గా ప్రకటించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బ్రిటన్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొత్తం 190 మంది పురుషులపై సినాగా అత్యాచారం చేసినట్లు పోలీసులు మోపిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయ స్థానం తుది తీర్పునిచ్చింది. సినాగాకు 30 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సినాగా గది నిండా భారీ ఎత్తున లిక్కర్ బాటిళ్లు, గోడలపై రక్తపు మరకలు కనిపించినట్లు పోలీసులు నివేదించడం గమనార్హం.