కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణా సచివాలయ ఆవరణలో నిర్మించబోయే మసీదు నమూనాలు ఆదివారం ప్రభుత్వానికి అందాయి. తమ ప్రార్థనా మందిరపు నమూనాలను ముస్లిం పెద్దలు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ వ్యవహారాలు) ఏకే ఖాన్ కు అందజేశారు. సచివాలయాన్ని నిర్మిస్తున్న రోడ్లు, భవనాల శాఖకు మసీదు నమూనాలను అందించనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ పరిశీలించిన తర్వాత నమూనాలపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆయా మసీదు నమూనాలను దిగువన చూడవచ్చు.