‘లిస్ట్ దగ్గర పెట్టుకోండి… స్టడీ చేయండి… కిందనుండి పైకి.. పైనుంచి కిందకి… మనోళ్లున్నరు… ఏబీసీలుగా లెక్కబెట్టండి. వర్గీకరణ చేయండి. రేప్పొద్దున… సపోజ్, వీళ్లకు కూడా… చెప్పకూడదు. ఆఫ్ ది రికార్డ్. మిత్రులెవరూ లేరు కదా? డబ్బులు కూడా ఇస్తం. ఎస్… ఇబ్బందేం లేదు. భయమేమీ లేదు. ఖర్చుల కింద…’ అంటూ ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరాలో రెండు రోజుల క్రితం నిర్వహించిన పార్టీ ముఖ్యుల సమావేశంలో రాములునాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ అభ్యర్థి తరపున భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారని, ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యల వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారడం విశేషం. ఆయన ఏమన్నారో దిగువన గల వీడియోలో చూసేయండి.