ఎప్పుడూ తనదైన శైలిలో కాస్త ఘాటు విమర్శలు చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈసారి కాస్త సుతిమెత్తని విమర్శ చేశారు. ప్రభుత్వ తీరుపై, విధానాలపై తీవ్రంగా విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తెలంగాణా ముఖ్యమంత్రిని ఓ విషయంలో అభ్యర్థించడమే అసలు విశేషం. ఆమె ఏమంటున్నారంటే…
‘సీఎం కేసీఆర్ గారూ.., ఇది నా అభ్యర్థన. దయచేసి మీ 300 ఎకరాల ఫాం హౌజ్ నుంచి సీఎం క్యాంపు ఆఫీసుకు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు వేయకండి. మీ రాకపోకల వల్ల భారీ వర్షాల్లో కూడా 60 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాళ్లు కూడా (ప్రజలు) క్షేమంగా ఇళ్లకు చేరాలి కదా? ఓసారి ఆలోచించండి సార్…’ అంటూ ఎమ్మెల్యే సీతక్క తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లోనూ సీఎం కాన్వాయ్ వెడుతున్న సందర్భంగా ట్రాఫిక్ నిలిపేస్తున్న తీరుపై సీతక్క ఆయా విధంగా చేసిన ట్వీట్ వైరల్ గా మారడం విశేషం. సీతక్క చేసిన ట్వీట్ ను దిగువన మీరూ చూసేయండి.