సీపీఐ జాతీయ నేత నారాయణకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘నోరు అదుపులో పెట్టుకోకుంటే సీఎం కేసీఆర్ వదిలేసిన చెవ్వు తెగుద్ది బిడ్డా’ అంటూ అజయ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈమేరకు ‘మినిస్టర్ పువ్వాడ అజయ్ ఇన్ఫో-112’ పేరుతో గల వాట్సప్ గ్రూపులో మంత్రి కొద్ది నిమిషాల క్రితమే, రాత్రి 7.44 గంటలకు స్వయంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆయా పోస్టును ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదవవచ్చు.
CPI చికెన్ నారాయనా. CPI చానల్ 99 ని అమ్ముకున్నవ్. పార్టీ ని సున్నాకి తెచావ్, నెను ఎ పార్టీ లొ వున్నా ప్రజలు నన్ను గెలిపుంచారు. నువ్వెప్పుడైనా ప్రజలనుండి గెలిచావా ? నీ జాతకం మొత్తం నెను నొరు విప్పితె బజారు పాలైతవ్. నీకు ‘పువ్వాడ’ అనె పెరు వింటె పాంటు తదుస్తది. మా నాన్న దగ్గరనుండి నువ్వు సాయం పొంది ఆయనకె దెబ్బెసావ్. 2006 లొ పార్టీ లొ మా నాన్నకు మెజరిటీ వున్నా రాజ్యసభకు పొకుండా అడ్డుకున్నవ్. 2009 లొ ఖమ్మం MP మహా కూటమి అభర్ధిగా మా నాన్న కు decide అయితె , చంద్ర బాబు దగ్గర 4 కొట్లు తీసుకొని దాన్ని అమ్ముకున్నవ్. 2011 లొ మా నాన్న సిట్టీంగ్ MLC ని మల్లి కాకుండా అడ్డుకున్నవ్. నీకు మా కుటుంబం తొ సమస్య , నాతొ కాదు. నాకు తెలుసు. నీ నీచ రాజకీయ బతుకుని ఎండగడతా. నువ్వు 2018 ఎన్నికల్లొ లొ ఖమ్మం వచ్హి నన్ను ఒడిచమన్నవ్. ప్రజలు గెలిపించ్జారు. నాకు మంత్రి పదవి KCR ఇస్తె నీకెందుకు లాగులు తడుస్తున్నయ్. ఖబడ్దార్. నొరు అదుపులొ పెట్టుకొ, లెకపొతె మా KCR వదిలెసిన నీ చెవ్వు తెగుద్ది బిడ్డా.
పువ్వాడ అజయ్