రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముస్లిం సోదరులకు ‘షబ్-ఎ-బరాత్’ సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభానికి ముందు వచ్చే ఈ పండుగ సందర్భంగా మంత్రికి చెందిన వాట్సాప్ గ్రూపులో వినూత్నంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపడం విశేషం. ఈ శుభాకాంక్షలను తెలుపుతూ ‘ఆప్ కా అజయ్ ఖాన్’ అంటూ మైనార్టీల పట్ల తన అప్యాయతను మంత్రి వ్యక్తం చేయడం ప్రత్యేక విశేషాంశంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మంత్రి అజయ్ తరపున ఈ ఆసక్తికర శుభాకాంక్షల పోస్టును ఆయన పీఆర్వో వినోద్ పోస్ట్ చేశారు.