ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని బాలాజీ ఎస్టేట్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నగరంలోన వీడివోస్ కాలనీలోని బాలాజీ ఎస్టేట్స్ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వత్సవాయి రవి ఆధ్వర్యంలో ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి అజయ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అజయ్ ఈ సందర్భంగా బాలాజీ ఎస్టేట్స్ ఉద్యోగులను అభ్యర్దించారు.