దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ లో విలీనమైన సత్తుపల్లి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు జాతి కీర్తి శిఖరం, నటునిగా, నాయకునిగా ఎన్టీఆర్ గారు తెలుగుజాతి హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. నలభై ఏళ్ల పాటు వందల చిత్రాల్లో విలక్షణ నటనను కనబర్చి విభిన్నమైన పాత్రల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారని, ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారని కొనియాడారు. ప్రజా నాయకుడిగా ఉంటూ అందరితో అన్నగారు అని అభిమానంగా పిలుచుకునే స్థాయికి చేరారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి పువ్వాడ ఘన నివాళులు అర్పించారు.
అదేవిధంగా సత్తుపల్లిలోని తన నివాస గృహంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు