భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన హైదరాబాద్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను ఉటంకిస్తూ తెలంగాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాట్సాప్ గ్రూపులో కొద్దిసేపటి క్రితం సంచలన పోస్ట్ చేశారు.
‘హైదరాబాద్ కు వరద వచ్చి మూసీ నదిని, చర్మినార్ ని ఎలా కదిగెసిందొ చూడండి’
అంటూ ఆయన మూడు ఫొటోలను కూడా వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడం విశేషం.
‘మినిస్టర్ పువ్వాడ ఇన్ఫో-112’ అనే తన అధికారిక వాట్సాప్ గ్రూపులో మంత్రి అజయ్ కుమార్ ఆయా వ్యాఖ్యలతో కూడిన ఫొటోలను పోస్ట్ చేయడం గమనార్హం. ఆయా ఫొటోలను, వాట్సాప్ పోస్టును దిగువన చూడవచ్చు.