తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐదురోజులపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెడుతున్నారు. శనివారం రాత్రి ఆయన దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనకు బయలుదేరుతున్నారు. మూసీ నది పునరుజ్జీవం కోసం దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో స్టడీ టూర్ కోసం శనివారం బయలుదేరుతున్న ప్రతినిధి బృందానికి మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన విజయవంతం కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఈమేరకు సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో కలిసి పర్యటన విజయవంతం కావాలని మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. సియోల్ నగరంలో ఒక నాడు మురికి కుపంగా ఉన్న హాన్ నదిని అభివృద్ధి పరిచిన తీరును అధ్యయనం చేసి, ఆ అనుభవాలు మూసీ పునరుజ్జీవం కోసం ఉపయోగపడాలని మంత్రి సీతక్క అభిలషించారు. కాగా దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని మళ్లీ ఈనెల 24వ తేదీ రాత్రికి మంత్రి పొంగులేటి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.