బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు తెలంగాణా ప్రభుత్వం సూచనలాంటి హెచ్చరికను జారీ చేసింది. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, పూర్తిగా తొలగిపోలేదని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.
బతుకమ్మను ప్రజలు ఇంట్లోనే జరుపుకోవాలని, సుఖ, సంతోషాల పర్వదినాలను శాంతి లేకుండా, సుఖం లేకుండా చేసుకోవద్దని హితవు చెప్పారు. కేరళలో ఇటీవల ‘ఓనం’ పండుగకు ముందు, తర్వాత కరోనా పరిణామాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
బతుకమ్మ, దసరా పండుగల విషయంలో తెలంగాణా ప్రజలు వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై మంత్రి ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయా వీడియోలో మంత్రి ఈటెల ఇంకా ఏమన్నారో దిగువన చూసేయండి.