కరోనా ధాటికి తెలంగాణాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు, కొందరు మంత్రులు సైతం వణికిపోతున్నారు. సరిగ్గా పది రోజుల క్రితం పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చెప్పారో గుర్తుంది కదా? కరోనా సోకితే కంగారు పడాల్సిన అవసరం లేదని, మన కడుపులో దేవుడు మంచి మెషీన్ ఇచ్చాడని, వేడినీళ్ల ద్వారా కరోనా కడుపులోకి జారితే కింద నుంచి బయటకు పారేస్తుందని చెప్పారు కదా? నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను మళ్లీ ఓసారి ఆయన మాటల్లోనే జాగ్రత్తగా చదవండి.
‘కరోనా ఒచ్చి పడిశెం ఉన్నోళ్లకు గొంతుల ఆగుతది. గొంతుల ఉంటే…? శరీరానికెక్కుతది. పడిశెం, దగ్గు లేకపోతే…? టక్కున కడుపులకు బోతది కరోనా. మీ కడుపు మిషిన్ మంచిది. ఎసువంటి బొక్కలుగాని, సిమెంటుగాని, ఏది గూడ నమిలిపెట్టే మిషిని భగువంతుడిచ్చిండు మనకు కడుపుల మిషిని. అండ్ల మిషిన్ల బడితె… పిప్పి, పిప్పి జేసి కింది నించి బారేత్తది కరోనా రోగాన్ని గూడ. అంత మంచి మిషినిచ్చిండు భగువంతుడు. కడుపుల బడాలె మనకు. వేన్నీళ్ల ద్వారా కడుపుల బడితె ఒచ్చింది ఎల్లిపోతది’ ఇవీ మంత్రి దయాకర్ రావు కరోనా గురించి పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు.
కానీ తాజా పరిణామాల్లో మంత్రి దయాకర్ రావు పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్టు సారాంశం ఏమిటో తెలుసుకోవాలని ఉందా…? అయితే దిగువన గల ఆయా పోస్టును చదివి విషయాన్ని మీరే అవగతం చేసుకోండి.
ఇదీ చదవండి: ‘కడుపుల బడితే కింద నుంచి బయిటికి బోతది’! కరోనాపై మంత్రి మస్తు జెప్పిండు!!