మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మెన్ ఆలం రామ్మూర్తి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ మధ్యాహ్నం రామ్మూర్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం పస్రా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆలం రామ్మూర్తి ఆకస్మిక మరణం పట్ల ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్మూర్తి మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తదితరులు సంతాపం తెలిపారు.