మేడారంలో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం బంద్ చేస్తున్నట్లు గిరిజన పూజారులు ప్రకటించారు. మార్చి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమ్మవార్ల దర్శనం ఉండదని, వనదేవతల గద్దెలను మూసివేస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన మినీ జాతర సందర్భంగా కొందరు కరోనా బారిన పడిన నేపథ్యంలో పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.