భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. రఘునాథపాలెం ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనిగా మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ నాయకుడు ఆజాద్ పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరిగిందన్నారు. తమ పార్టీకి త్యాగాలు కొత్తేమీ కాదన్నారు. రఘునాథపాలెం ఎన్కౌంటర్ కు అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రులు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని, తమ కామ్రేడ్స్ నెత్తుటి బాకీ త్వరలోనే తీర్చుకుంటామని ఆజాద్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈనెల 9వ తేదీన జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.