మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆరు నెలల జైలు శిక్షకు గురయ్యారు. ఈ శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు చెప్పింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా డబ్బు పంపిణీ చేశారనే అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణ అనంతరం ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు చెప్పింది. ఈమేరకు ఎంపీ కవిత రూ. 10 వేల జరిమానా చెల్లించగా, ఆమెకు బెయిల్ లభించింది.