తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయంలో మంత్రుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పోన్ ద్వారా అడిగి తీసుకుని లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపారు. ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు లాక్ డౌన్ నుంచి ప్రజలకు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ వరకు దీని అమలుకు గడువు ఉన్న నేపథ్యంలోనే, లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే ఈనెల 20వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని కూడా రద్దు చేసినట్లు సమాచారం.