అందమైన హైదరాబాద్ నగరం. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన మహానగరం. కరోనా కల్లోల పరిస్థితులు హైదరాబాద్ నగరాన్ని ఎలా చూపుతున్నాయి? అసెంబ్లీ భవనం, వండర్ లా ఎమ్యూజ్ మెంట్ పార్క్, ఎంజీబీఎస్, ఔటర్ రింగ్ రోడ్, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, చార్మినార్, ఎంజే మార్కెట్ వగైరా ప్రాంతాలు, ప్రదేశాలు ఇప్పుడెలా ఉన్నాయి? అంటే కరోనా లాక్ డౌన్ పరిణామాల్లో, పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం తాజాగా ఎలా సాక్షాత్కరిస్తోంది? అనే అంశంపై తెలంగాణా ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. మన హైదరాబాద్ నగరానికే కాదు, మన ఊరుకు, మన దేశానికి, ప్రపంచానికే పట్టిన కరోనా పీడ విరగడ కావాలని కాంక్షిస్తూ, వీడియోను దిగువన వీక్షించండి.