తెలంగాణాలో బుధవారం నుంచి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. అయితే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. నిత్యావసర సరుకులతోపాటు అన్ని సరుకుల క్రయ, విక్రయాలకు వెసులుబాటు కల్పించారు.