కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో దరఖాస్తుదారుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన రెవెన్యూ అధికారుల జాబితాను విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర సిబ్బంది సహా మొత్తం 43 మందిపై చర్యలకు విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది.
అయితే ఈ వసూళ్ల రాయుళ్ల జాబితాలో తొలిపేరు వరంగల్ అర్బన్ (ప్రస్తుత హన్మకొండ) జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ దే కావడం విశేషం. జాబితాలోని 42 మంది పేర్లు సరిగానే ఉన్నాయని, కానీ ధర్మసాగర్ తహశీల్దార్ పేరు నమోదు ఆసక్తికరంగా ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఎం. రాజ్ కుమార్ పేరును ఉటంకిస్తూ ధర్మసాగర్ తహశీల్దార్ గా ప్రస్తావించారు. కానీ ఈ పేరుతో ధర్మసాగర్ లో ఎవరూ తహశీల్దార్ గా పనిచేయలేదని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత తహశీల్దార్ పేరు సీహెచ్ రాజు కావడం గమనార్హం.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం సిఫారసు చేసిన జాబితాను దిగువన చూడవచ్చు.