తెలంగాణా పోలీసు శాఖలో పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో 26 నాన్ కేడర్ ఎస్పీ, 122 డీఎస్పీల పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్, మంజూరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సీఐలకు, అదనపు ఎస్పీలకు లైన్ క్లియరైనట్లుగానే భావించవచ్చు. రెండు, మూడు రోజుల్లో నిబంధనల ప్రకారం పదోన్నతులను కూడా ఇచ్చే అవకాశం ఏర్పడింది. సీఐలు డీఎస్పీలుగా, అదనపు ఎస్పీలు ఎస్పీలుగా ప్రమోషన్ పొందుతారు. ఆ తర్వాత వీరికి పోస్టింగులు ఇస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులున దిగువన చూడవచ్చు.