ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో ఇది. ఏమిటీ ఇందులో విశేషం అంటే… ఓ తల్లి చిరుత తన రెండు పిల్లలను వెంటేసుకుని రోడ్డు దాటుతోంది. దీంతో అటుగా వస్తున్న కార్లు అకస్మాత్తుగా నిలిచిపోక తప్పలేదు. చిరుత వెంట పరుగెత్తాల్సిన బుడి బుడి నడకల బుల్లి చిరుతల్లో ఒకటి తల్లిని అనుసరిస్తూనే ఉన్నట్టుండి వెనక్కి తిరిగింది. నడి రోడ్డుపై తచ్చాడుతున్న తన చిన్నారిని నోట కర్చుకుని ఎత్తుకెళ్లేందుకు తల్లి చిరుత ప్రయత్నించింది. కానీ ఇంతలోనే మరో చిన్నారి కూడా మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. దీంతో తల్లి చిరుత ఇక తనవల్ల కాదంటూ వెళ్లిపోతుండగా, చిన్నారి చిరుతలు అనుసరించక తప్పలేదు.

ఐఎఫ్ఎస్ అదికారి సుధా రామెన్ విడుదల చేసిన ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం మాత్రం స్పష్టంగా లేదు. ఈ దృశ్యం ఇండియాకు చెందినది కాకపోవచ్చని, ఆఫ్రికన్ సఫారీ పార్కు బాపతుగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నడిరోడ్డుపై ఈ ‘చిరు’తల విన్యాసపు వీడియో వైరల్ గా మారడమే అసలు విశేషం.

Comments are closed.

Exit mobile version