ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్ (45) దారుణ హత్యకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారు పొలాల్లో రంగనాథ్ నిర్జీవంగా పడి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. రంగనాథ్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిన్న సాయంత్రం ఓ మహిళ సహా నలుగురు ఇతర వ్యక్తులతో రంగనాథ్ తమ పొలాల ప్రాంతాల్లో సంచరించారని స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోజు అదే ప్రాంతంలో రంగనాథ్ హత్యకు గురైనట్లు రైతుల ద్వారా పోలీసులు కనుగొన్నారు.
నిన్న రంగనాథ్ తో కలిసి కనిపించిన నలుగురు వ్యక్తుల్లో ఓ మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రాథమిక సమాచారం. ఖమ్మం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో రంగనాథ్ కు గ్రానైట్ క్వారీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.