ఓ రోడ్డు సైడ్ రోమియోకు కాన్పూర్ లో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్ ఒకరు భలే గుణపాఠం చెప్పారు. ఓ పాఠశాల వద్ద తిష్ట వేసి విద్యార్థినులను వేధిస్తున్న ఆ పోకిరీ నిత్య చేష్టలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మహిళా కానిస్టేబుల్ తన షూ తీసి రోమియోను ఎడా పెడా బాదేసింది. కానిస్టేబుల్ అతనికి తగిన గుణపాఠం చెప్పారని స్థానికులు ప్రశంసలు కురిపించారు. పాఠశాల విద్యార్థినుల పట్ల పోకిరీ చేష్టలకు పాల్పడిన ఆ రోమియోను ఈ మహిళా కానిస్టేబుల్ తన షూ తీసి ఎలా కొడుతున్నారో కింది వీడియోలో చూడండి.