ఖమ్మంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాళా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రూ. 72 లక్షల మొత్తానికి తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోరుతూ ఆయా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో తొమ్మిది మంది రుణదాతలను ప్రతివాదులుగా చేర్చారు.
కోర్టులో దాఖలైన పిటిషన్ లోని వివరాల ప్రకారం.. నగరంలోని శుక్రవారిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దొడ్డా వెంకటేశ్వరరావు రెండు దశాబ్ధాలుగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. తన వ్యాపార అవసరాలకు పలువురి వద్ద అప్పులు తీసుకున్నారు.
అయితే కోవిడ్, ఇతరత్రా కారణాలవల్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణదాతల వద్ద తీసుకున్న అప్పులను తిరిగి చెల్లింలేకపోయినట్లు వెంకటేశ్వరరావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోరుతూ అడ్వకేట్లు చుంచుల మల్లిఖార్జున్ రావు, ఆర్. నారాయణస్వామిల ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.