ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమారుని వివాహానంతరం ఆదివారం ఏర్పాటు చేసిన ‘రిసెప్షన్’ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీలో మాస్ లీడర్ గా ప్రాచుర్యం పొందిన శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు అంచనాకు మించి జనం హాజరు కావడాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకుంటున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రిసెప్షన్ సాయంత్రం 5.30 గంటల వరకు సాగిందంటే హాజరైనవారి సంఖ్యను అంచనా వేసుకోవచ్చు. వేడుకకు హాజరైనవారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి-మాధురి, పొంగులేటి ప్రసాదరెడ్డి-శ్రీలక్ష్మి దంపతులు సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులు హర్షరెడ్డి-సోమరెడ్డిలను ఆశీర్వదించారు. అంతేగాక తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భట్టి విక్రమార్క, సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జెడ్పీ చైర్మెన్లు లింగాల కమల్ రాజ్, కోరం కనకయ్య, ఖమ్మం నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి తదితర ప్రముఖులు వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రిసెప్షన్ కు సంబంధించిన అట్టహాస ఏర్పాట్లు, ప్రముఖుల హాజరుకు సంబంధించిన దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.