చిన్నా, చితకా పనులకు కూడా మినిస్టర్ల పేర్లు, వాళ్ల పీఏల పేర్లు చెబితే ఎవరికైనా అసహనం కలుగుతుంది. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదా? సాధారణ తనిఖీల్లో సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలు పట్టుబడితే…, వాటిని విడిపించుకునేందుకు స్థానిక నాయకులు బడా నేతల పేర్లు వాడుకుంటుంటారు. ఇదే అంశంపై ఖమ్మం జిల్లా చింతకాని ఎస్ఐ రెడ్డమల్ల ఉమ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విషయమేమిటంటే…ఈ మధ్యఅతివేగంగా వెడుతున్న ట్రాక్టర్ల వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల్లేకుండా, బండి కాగితాలు లేకుండా, ఓవర్ స్పీడ్ వల్ల ఇష్టానుసారంగా నడుపుతున్న ట్రాక్టర్ల డ్రైవర్లకు, యజమానులకు చింతకాని పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనూ మంత్రిపేరును, ఆయన వ్యక్తిగత సహాయకుల పేర్లను కొందరు వాడుకుంటున్నారా? ఇదే అంశాన్ని ఉటంకిస్తూ లక్ష్మణ్ అనే వ్యక్తిని ఉద్ధేశించి చింతకాని ఎస్ఐ ఉమ ఏమంటున్నారో దిగువన గల వీడియోలో చూడండి.