తెలంగాణా సీఎం కేసీఆర్ సతీమణి సహా పలువురు కుటుంబ సభ్యులు కాశీకి వెళ్లారు. రెండు రోజులపాటు కాశీలోనే ఉండనున్న కేసీఆర్ సతీమణి శోభ, ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత వారణాసిలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం కుటుంబ సభ్యులు తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. అస్సి ఘాట్ కు బోట్లో తిరుగు ప్రయాణం చేస్తారుు. సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శిస్తారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుడికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు.