తెలంగాణాలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. తెలంగాణా భవన్ లో రెండున్నర గంటలపాటు సాగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ను త్వరలోనే సీఎం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన స్పష్టత అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.