కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక సీఎం యెడియూరప్ప స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కరోనా వైద్య పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని, తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిందిగా సీఎం యెడియూరప్ప కోరారు.