వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 153-A, 295-A, 298 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద క్రైం నెం. 144/2021 ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేవిధంగా ప్రతిజ్ఞ చేశారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి సుధ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.