భారత సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ (సీజేఐ)గా ఎన్వీ రమణ పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఆయనను 48వ సీజేఐగా ప్రతిపాదిస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈమేరకు జస్టిస్ బోబ్డే కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. వచ్చే ఏప్రిల్ 23న జస్టిస్ బోబ్డే సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీన సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.