పండ్లను గ్రేడింగ్ చేసే అంశంలో వ్యాపారులు రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. నాణ్యత ప్రకారం పండ్లను గ్రేడ్ల వారీగా విభజించి మార్కెటింగ్ చేస్తుంటారు. ఇందుకోసం ఒక్కోసారి పెద్ద ఎత్తున కార్మికుల అవసరం ఉంటుంది. అయినప్పటికీ ఖచ్చితమైన ప్రమాణం ప్రకారం పండ్ల విభజన జరగకపోవచ్చు.
కానీ దిగువన గల వీడియోను చూడండి. దానిమ్మ పండ్లను ఓ వ్యక్తి ఎలా గ్రేడింగ్ చేస్తున్నాడో? చాలా సింపుల్ టెక్నాలజీని వినియోగిస్తూ ఖచ్చితత్వ గ్రేడింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ రెండు రాడ్లను ఏటవాలుగా ఉంచి, దిగువకు వచ్చే కొద్దీ రాడ్ల మధ్య వైశాల్యాన్ని పెంచడం గమనార్హం. అయిదారు కార్టన్ బాక్సులను వరుసగా పెట్టి దానిమ్మ పండ్లను విభజిస్తున్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. దీన్ని ‘జుగాద్’గా వ్యవహరిస్తారట. వాలా అఫ్షర్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. నెటిజన్ల ఫిదాతో వీడియో వైరల్ గా మారింది. మీరూ చూసేయండి.