కరోనా కల్లోల పరిణామాల్లో నిత్యావసరాల పంపిణీ ఖమ్మం జర్నలిస్టు వర్గాల్లో కీచులాటకు దారి తీసింది. అన్ని వర్గాల మాదిరిగానే పాత్రికేయ వర్గీయులనూ ఆదుకునేందుకు పలువురు ముందుకు వచ్చారు. వీరిలో ప్రముఖ పారిశ్రామిక, రాజకీయ, వ్యాపారవేత్తలైన గాయత్రి రవి, వీవీసీ రాజేంద్రప్రసాద్ వంటి ముఖ్యులు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జర్నలిస్టులకు పంపిణీ చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జర్నలిస్టుల మధ్య సోషల్ మీడియా పోస్టింగుల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాలు చివరికి స్వీకరించిన నిత్యావసర సరుకులను తిరిగి ఇచ్చేస్తామనే స్థాయికి చేరుకున్నాయి. నిత్యావసర సరుకుల పంపిణీ అంశంలో జర్నలిస్టుల కీచులాటకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను దిగువన ఉన్నది ఉన్నట్లుగా చదవవచ్చు.
?చాంబర్ ఆఫ్ కామర్స్ ఇది మీకు తగునా..??
?జర్నలిస్టులను బిచ్చగాళ్ళుగా చూస్తారా…!!?
? మూడు కేజీల బియ్యం ఇవ్వడానికి మీకు మనసు ఎలా వచ్చింది.
? సేవా కార్యక్రమాల పేరుతో అవమానిస్తారా ..
? వీఆర్వోల సంఘం, డాక్టర్ M.F. గోపీనాథ్ వంటి వారు వ్యక్తిగతంగా ప్రతి జర్నలిస్టులకు పది కేజీల బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను ఇచ్చారు.
?వందల కోట్ల టర్నోవర్ ప్రజల ద్వారా లావాదేవీలు చేస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సేవా కార్యక్రమాల పేరుతో ఏకంగా జర్నలిస్టులే అవమానపరిచే విధంగా చేయటం సిగ్గుచేటు.
? రేషన్ బియ్యం రీసైక్లింగ్ నుంచి మొదలుకొని పప్పు మిల్లు కల్తీ నూనెలు పప్పు ఉప్పు సర్వం కల్తీ మయంగా చేస్తూ సామాన్య ప్రజలకు అధిక రేట్లకు అంటగడుతున్నారు.
? ఉప్పు నుంచి మొదలుకొని బంగారం వరకు అన్ని శాఖలు చాంబర్ ఆఫ్ కామర్స్ లోనే విలీనమై ఉన్నాయి .
?ఇటువంటి అతిపెద్ద వాణిజ్య వ్యవహారాలను చూస్తున్న సంఘం నాయకులు జర్నలిస్టుల పట్ల హుందాగా వ్యవహరించాల్సి ఉంది.
? కానీ కేవలం మూడు కేజీల బియ్యం కొంత పప్పు ఉప్పు ఇచ్చి అవమానించడం పట్ల యావత్తు జర్నలిస్టులు మానసికంగా కుంగిపోయే ఎలా ఉంది.
?మంచి నీళ్లు పోసినా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చిన సంతోషపడే వాళ్ళం.
?చేతనైన సహాయం చేశారు అనుకోవడం కంటే మీకు నా బలం బలగాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది.
?గాంధీ చౌక్ నుంచి మొదలుకొని సిటీ మొత్తం లో ఉన్న అన్ని షాపులను పరిగణలోకి తీసుకొని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించి ఉంటే పట్టెడు అన్నం నాలుగు పూటలా వచ్చేది.
? తోటివారికి సహాయం పడండి, కానీ చేయూత పేరుతో ఇతరులను అవమానించకండి.
జర్నలిస్టు మిత్రులారా మేల్కొనండి..
జర్నలిజాన్ని గౌరవిద్దాం….
జర్నలిస్టుల వృత్తిని గౌరవిద్దాం…..
ఆకాశమంత ఆవకాశముండి…..
పితకంత సహాయం చేసి…..
ఇలాంటి అరకొర సహాయలకు మధ్యవర్తులుగా వ్యవహరించి అబసుపాలు కాకండి…..
కొండంత ప్రచారం పొందాలనే వారి దగ్గర నుంచి ఎలాంటి సహాయం స్వీకరించకుండా ఉండటమే ఉత్తమం…….
జర్నలిస్టులు గా మన వృత్తిని కాపాడుకుందాం….
ఏకతాటిపై వచ్చి పరిశీలించుకుందాం…
ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దలు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు, సీనియర్లు, జూనియర్లు, చిన్న లు, పెద్దలు, మిత్రులు, సహచరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు..
కరోనా లాక్డౌన్ సమయంలో ఒక జర్నలిస్టుగా, సామాన్య పౌరుడిగా ప్రజల అందరితో పాటు నేను కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాకు సైతం అండగా నిలిచి చేదోడు వాదోడుగా ఏదో ఒక రూపంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే క్రమంలో నాకు మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, ఒక యూనియన్ కు పెద్ద నాయకుడుగా ఉన్న ఆదినారాయణ గారు నాకు ఒక రోజు ఫోన్ చేసి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాయత్రి రవి గారు జర్నలిస్టుల అందరితోపాటు మీకు కూడా పావు కింటా బియ్యం , కొన్ని కిరాణం సరుకులు ఇవ్వమన్నారు అని చెప్పడంతో సంతోషంతో వెంటనే రవన్న గారికి , ఆది నారాయణ గారికి ఫోన్ లో కృతజ్ఞతలు చెప్పి ఆ పావు కింటా బియ్యం, కిరాణా సరుకులు తీసుకోవడం జరిగింది. అయితే జర్నలిస్టులకు సహాయం చేసిన విధానంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ నా మనసును తీవ్రంగా గాయపరిచింది. నిజంగా ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యలతో ఉన్న నేను గాయత్రి రవి, ఆదినారాయణ గారి సహాయంపై అంతగా ఆలోచించలేదు. కానీ, తాజా పరిణామాలు, చర్చనీయ సంఘటనలతో కష్టకాలంలో ఉపవాసం అయినా ఉండాలి కానీ.. ఎటువంటి సహాయాలు పొంద వద్దు అని నిర్ణయానికి వచ్చాను. తనను ఆదరించి, అభిమానంతో, పెద్ద మనసుతో రవన్న గారు సహాయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ.. టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ లో ఖమ్మం నగర కమిటీ కన్వీనర్ గా , జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రధాన బాధ్యతల్లో ఉన్న నేను వారి సహాయం పొందడానికి అనర్హుడిగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల పై జర్నలిస్టు యూనియన్ల మధ్య జరుగుతున్న అభ్యంతర కరమైన చర్చ, విమర్శల నేపథ్యంలో నా మనసు తీవ్రంగా మదన పడుతోంది. పదే పదే దానం చేశామని చెప్పుకునే వారి బియ్యం, సరుకులు తినేందుకు నాకు, నా మనసు కు ఇష్టం అనిపించడంలేదు. నా మనసును కష్టపెట్టి నేను ప్రశాంతంగా ఉండలేను. కాబట్టి నాకు ఇచ్చిన పావు క్వింటా బియ్యం, సరుకులు తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాను. దయచేసి నా వ్యక్తిగత నిర్ణయంలో ఎవరూ అపార్థం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఆది నారాయణ గారికి ఇంటి వద్ద అందజేస్తాను.. కృతజ్ఞతలతో..
పాపారావు, జర్నలిస్ట్, ఖమ్మం.
నిత్యవసర వస్తువులు తిరిగి వాపసు
………………………
మంత్రి గారి ఇంటి వద్ద నిత్యవసర వస్తువులు ఇస్తున్నారు అంటే మా బ్యూరో గారితో పాటు నేను కూడా వెళ్లాను. అక్కడ వివిసి ట్రస్ట్ వారితో పాటు(kju) నాయకులు కూడా ఉన్నారు. అప్పుడే నా మనసు కొంత ఇబ్బందికరంగా అనిపించినా కూడా కొందరుతో పాటు నేను కూడా తీసుకున్నాను..
తీసుకున్న సరుకులు ప్రస్తుతం అలాగే ఉన్నాయి.
జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బాధేస్తుంది. సామాన్య జర్నలిస్టులకు ఒక ప్యాకేజీ.. బ్యూరో స్థాయి నాయకులకు మరో ప్యాకేజీలు తీసుకోవడం మనసుకు బాధగా అనిపించింది.
జర్నలిస్టు నాయకులు అనేవారు సమదృష్టితో చూడాలేగానీ, నాయకులే పంచుకుంటే ఎలా..??
మేము కూడా పంపిణీ చేశాము అనుకోవడం కంటే బాధ్యతగా జర్నలిస్టులందరికీ న్యాయబద్ధంగా సాయం చేశాము అనిపించుకోవడం ఉత్తమం. అలాంటి నాయకులు రావాలి.. కావాలి…
ప్రస్తుత పరిస్థితులను చూసి నేను తీసుకున్న నిత్యవసర సరుకులను నా కుటుంబ సభ్యులతో కలిసి తినేందుకు మనసు రావడం లేదు.
తీసుకున్న సరుకులను తిరిగి వాపసు ఇవ్వాలనుకుంటున్నాను.
1) రాంనారాయణ గారి ఇంటి వద్ద 5kg ల బియ్యం
2) వెంకట్రావు గారి ఇంటి వద్ద ఉల్లిగడ్డలు
3) పాపారావు గారి ఇంటివద్ద కారం
4) ఏనుగు వెంకటేశ్వరావు గారి ఇంటివద్ద ఉప్పు…
ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఇతర చోటా నాయకులకు ఇవ్వడం జరుగుతుంది. With selfi తో….
మీ శ్రేయోభిలాషి…
గుద్దేటి రమేష్ బాబు, జర్నలిస్ట్, ఖమ్మం.